in ,

TS Govt. asks help of NIH-Kakinada in finding solution for floods in Hyderabad

National Institute of Hydrology in Kakinada
National Institute of Hydrology in Kakinada

Contributed by Durga Rao

గత రెండు నెలల నుంచి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌లో శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నాది.. దీనిలో భాగంగా హైదరాబాద్ లో వరదల సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కాకినాడ NIH కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

లేఖలొ వరదలను ఎదుర్కొనేందుకు చెన్నైలో అమలు చేసిన విధి విధానాలను సూచీగా తీస్కుని భాగ్యనగరానికి వరదలను ఎదుర్కొనేందుకు పరిష్కారం కోరుతూ కాకినాడలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్) కు తెలంగాణ నీటి పారుదల శాఖ తరఫున అధికారిక లేఖ రాశారు.

హైదరాబాద్‌లో వరదలను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్‌ఐహెచ్‌ సహకారం అందించాలి అని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

లేఖపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తామని కాకినాడ National Institute of Hydrology(ఎన్‌ఐహెచ్‌) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వై.ఆర్‌.ఎస్‌. సత్యాజీరావు తెలిపారు.

ఇది నిజంగా మనకి గర్వకారణమే మన కాకినాడలొ సంస్థకి భారీ వర్షాలకు సతమతమవుతున్న భాగ్యనగరానికి పరిష్కారం చూపే అవకాశం వచ్చినందుకు. చెన్నైలో వారు ఏ విధంగా పరిష్కారం చూపారో అలానే త్వరలో హైదరాబాదులో కూడా వరదలకు పరిష్కారం లభిస్తుంది అని ఆశిద్దాం.

If you wish to contribute, Write us at SUBMIT ARTICLES.

Written by Admin

Comments

Kakinada Smart City

How I like to see my city on my next visit in 2019.

Gowthami Express Train

Complete details of Newly updated Railway information for Southern Zone Railway including SCR.